04/07/2021
బ్యాంకింగ్ వ్యవస్థ ఏ దేశానికైనా మూలస్తంభంగా నిలబడుతుంది. ధనము యొక్క లావాదేవీలు డబ్బు యొక్క లావాదేవీలు సులభముగా స్వేచ్ఛగా నియంత్రణ లేకుండా జరిగినప్పుడు అది అభివృద్ధిని అత్యధికముగా చేస్తుంది. డబ్బు యొక్క వినియోగమును అదుపు చేయరాదు. డబ్బు ను నియంత్రించి నట్లయితే ఖర్చును నియంత్రించి నట్లయితే ఆ డబ్బు నల్లధనం గా మారుతుంది. ఇది ఇది ప్రజల వద్దకు చేరదు. ఇది రూపాంతరం చెందే ఆస్తుల రూపంలో సంపద రూపంలో బంగారం రూపంలో వ్యర్థముగా మిగిలిపోతుంది. పరాయి దేశస్తులు పరమ అవుతుంది. కాబట్టి ప్రజల మధ్య డబ్బులు లావాదేవీలలో ఎటువంటి నియంత్రణలు ఉండరాదు.
అయితే అత్యధిక నల్లధనం నియంత్రించడానికి సేవా ట్రస్టు లను అభివృద్ధి కార్యక్రమాల దత్తతను అత్యధిక గౌరవ పన్ను చెల్లింపు వ్యవస్థను పేదరిక నిర్మూలన వ్యవస్థను ప్రోత్సహించాలి. ఈ మార్గంలో చేయు ఖర్చుల పట్ల పూర్తి నియంత్రణను తొలగించాలి. అయితే కార్యక్రమాలను పర్యవేక్షించాలి. దేశ హితం కొరకు అభివృద్ధి కొరకు మాత్రమే ఉద్దేశించబడి ఉండాలి. వ్యతిరేకముగా ఉండరాదు.
బ్యాంకింగ్ రుణాలను సున్నా సాతం వడ్డీ పైన చిరు వ్యాపారస్తులకు గృహాలకు విద్యకు అందించాలి. పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలకు వడ్డీని అధికం చేయాలి. స్థిరముగా ఉంచాలి. దీని వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. పేదలకు బరువు తగ్గుతుంది. అనతికాలంలోనే వీరి దగ్గర డబ్బు పొదుపు చేయబడి తిరిగి ప్రభుత్వానికి అందుతుంది. ఇది దరిద్రాన్ని దేశం నుండి తొలగిస్తుంది.