prajasankalpavedika Kadapa

prajasankalpavedika Kadapa "Praja Sankalpa Vedika is a people platform promoting legal awareness, accountability & public Rights across Telugu States."

praja Sankalpa Vedika was registered under NitiAayog Govt.of India bearing unique ID AP/2022/0311737.

పోరుమామిళ్ల మరియు కలసపాడు బియ్యం మరియు వంట నూనెలు అమ్మే  హోల్సేల్ & రిటైల్ వ్యాపారస్థులకు, మిల్లులకు ప్రజా సంకల్ప వేదిక ...
25/04/2026

పోరుమామిళ్ల మరియు కలసపాడు బియ్యం మరియు వంట నూనెలు అమ్మే హోల్సేల్ & రిటైల్ వ్యాపారస్థులకు, మిల్లులకు ప్రజా సంకల్ప వేదిక చిన్న హెచ్చరిక ,..!!*

అవినీతి నిరోధక విభాగం రాష్ట్ర అధ్యక్షులు మరియు రాయలసీమ జోనల్ ఇంచార్జి* మోటపోతుల శివకుమార్***
ప్రజా సంకల్ప వేదిక

కడప జిల్లా పోరుమామిళ్ల మరియు కలసపాడు గ్రామాలలో ప్రజలు తినే సన్న మసురా బియ్యం 25 కేజీ తూకం ఉండాల్సిన బ్యాగ్ కేవలం 22 కేజీస్ మాత్రమే ఉన్నాయి. ఇలా తక్కువ తూకాలతో బియ్యం విక్రయిస్తున్నట్లు అలాగే వంట నూనె పామాయిలు, సన్ ఫ్లవర్ ఆయిల్ పాకెట్స్ తక్కువ తూకాలతోఅమ్ముతున్నట్లు కొంతమంది ప్రజలు ప్రజా సంకల్ప వేదికను ఆశ్రయించడం జరిగింది. కావున వ్యాపారస్థులకు తెలియజేయడం ఏమనగా 25 కేజీల కన్నా తక్కువ తూకం ఉన్న బియ్యం అమ్మరాదని, కొనరాదని వ్యాపారస్థులకు మరియు ప్రజలకు అందరికీ తూకం 25 కేజీలు కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకొని కొనవలెను . తూకం తక్కువ ఉన్న యెడల మా ప్రజా సంకల్ప వేదిక ఆఫీస్ ను సంప్రదించగలరని
శనివారం ఒక ప్రకటన లో ప్రజా సంకల్ప వేదిక అవినీతి నిరోధక విభాగం రాష్ట్ర అధ్యక్షులు మరియు రాయలసీమ జోనల్ ఇంచార్జి మోటపోతుల శివకుమార్ తెలిపారు .
ఇట్లు
ప్రజా సంకల్ప వేదిక
ఆంధ్రప్రదేశ్

03/03/2026

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న స్థానిక సంబంధిత అవినీతి పాలకుల/అధికారుల పైన ఆదాయ పన్నుశాఖ వారికి ఫిర్యాదు చేయవచ్చు.🇮🇳

ఆదాయానికి మించిన అధికారుల/పాలకుల వారి ఆస్తులుపై గుర్తించి వారికి సంబంధించిన ఫ్యామిలీ, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై రైడ్ చేసి వారు ఉద్యోగ చేరిన సమయంలో ఎస్.ఆర్ లో ఉన్న ఆస్తులు, చేరిన తరువాత వారు కొన్న ఆస్తులు,వారి బినామీ పేర్లతో ఉన్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఆదాయపన్నుశాఖ ఓ అధికారి మాట్లాడుతున్న సందర్భంలో వారు పై వివరాలు వెల్లడించారు.

అందువలన ప్రజలు వారి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ప్రజలు గమనించగలరు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి తక్షణం ఆన్లైన్ లో కంప్లైంట్ లు చేయవచ్చు🤝 అవినీతిపరులైన స్థానిక నాయకుల మీద కూడా కంప్లైంట్లు చేయవచ్చు ఆదాయపన్ను శాఖ వారికి.ED.iB IT. విజిలెన్స్ ACB నంబర్స్ గూగుల్లో సెర్చ్ చేయండి మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో డిస్ప్లే అవుతాయి సెర్చ్ చెయ్యండి. ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వెయ్యండి. ప్రజలే ప్రజాస్వామ్య నిర్ణేతలు.

అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ACB)ని సంప్రదించండి:
టోల్ ఫ్రీ నంబర్: 1064�వాట్సాప్: 8333995858�ఈమెయిల్: [email protected]
జిల్లాల వారీగా ACB సంప్రదింపు వివరాలు:
• కర్నూలు: డిఎస్పీ, నర్సింగ్ రావు పేట, ఫోన్: 08518-273783, సెల్: 9440446178
• అనంతపురం: డిఎస్పీ, శ్రీసదన్, సంగమేష్ నగర్, ఫోన్: 08554-274170, సెల్: 9440446181
• నెల్లూరు: డిఎస్పీ, కొండ బాలరామ్ రెడ్డి స్ట్రీట్, ఫోన్: 0861-2331833, సెల్: 9440446184
• ఒంగోలు: డిఎస్పీ, CRP క్వార్టర్స్, ఫోన్: 08592-232300, సెల్: 9440446189
• తిరుపతి: డిఎస్పీ, రాఘవేంద్ర నగర్, ఫోన్: 08772-220252, సెల్: 9440446190
• కడప: డిఎస్పీ, మారుతినగర్, ఫోన్: 08562-244637, సెల్: 9440446191
• తూర్పు గోదావరి (రాజమండ్రి): డిఎస్పీ, తిలక్ రోడ్, ఫోన్: 0883-2467833, సెల్: 9440446160
• కాకినాడ: డిఎస్పీ, నాగమల్లి తోట జంక్షన్, ఫోన్: 0884-2342785, సెల్: 9440446161
• ఏలూరు (పశ్చిమ గోదావరి): డిఎస్పీ, సెయింట్ జేవియర్ నగర్, ఫోన్: 0881-2232017, సెల్: 9440446157
• కృష్ణా (విజయవాడ): డిఎస్పీ, సిద్ధార్థనగర్, ఫోన్: 0866-2474140, సెల్: 9440446164
• గుంటూరు: డిఎస్పీ, చంద్రమౌళి నగర్, ఫోన్: 0863-2225850, సెల్: 9491305638
• విశాఖపట్నం: డిఎస్పీ, డాక్టర్స్ కాలనీ, సీతమ్మధార, ఫోన్: 0891-2552894, సెల్: 9440446170
• విజయనగరం: డిఎస్పీ, కుసుమ గజపతి నగర్, ఫోన్: 08922-276404, సెల్: 9440446174
• శ్రీకాకుళం: డిఎస్పీ, ఆఫీసియల్ కాలనీ, ఫోన్: 08942-222754, సెల్: 9440446124
అవినీతిని అంతం చేయడానికి మీ వంతు కృషి చేయండి. *ప్రజా సంకల్ప వేదిక * అవినీతి నిరోధక విభాగం రాష్ట్ర అధ్యక్షులు... మోటపోతుల శివకుమార్ ఫోన్. 8978972408.
🇮🇳 ప్రజలే సుప్రీమ్🇮🇳 జై హింద్🇮🇳 చేయి చేయి కలపండి🇮🇳

27/02/2026

రాయచోటిలో విజిలెన్స్ మెరుపు దాడులు: ₹1.50 లక్షల విలువైన ఎక్స్‌పైరీ కూల్ డ్రింక్స్ స్వాధీనం

రాయచోటి పట్టణంలో విజిలెన్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించారు. పట్టణంలోని రెండు గోడౌన్లలో కాలం చెల్లిన (Expired) కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
​ఈ దాడుల్లో సుమారు ₹1,50,000 విలువచేసే కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ మరియు వాటర్ బాటిల్స్ నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా గడువు ముగిసిన పానీయాలను నిల్వ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వీటిపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ప్రజలు ఏదైనా వస్తువు కొనే ముందు తయారీ, గడువు తేదీలను గమనించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

📌 నేటి అంశం: రేషన్ బియ్యం తక్కువ ఇస్తున్నారా? డీలర్ మీతో దురుసుగా ప్రవర్తిస్తున్నారా?ప్రభుత్వం పేదల కోసం పంపే రేషన్ సరుక...
26/02/2026

📌 నేటి అంశం: రేషన్ బియ్యం తక్కువ ఇస్తున్నారా? డీలర్ మీతో దురుసుగా ప్రవర్తిస్తున్నారా?

ప్రభుత్వం పేదల కోసం పంపే రేషన్ సరుకులు మీ హక్కు. డీలర్ మీకు చేసే 'సాయం' కాదు. ఒకవేళ డీలర్ అక్రమాలకు పాల్పడితే అతని లైసెన్స్ రద్దు చేయించే అధికారం మీకు ఉంది.

✅ వాస్తవాలు (The Facts):

• జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA): ఈ చట్టం ప్రకారం ప్రతి కార్డ్ హోల్డర్ నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత ధరకే (లేదా ఉచితంగా) సరుకులు పొందే చట్టబద్ధమైన హక్కు కలిగి ఉంటారు.

• తూకంలో తేడా: 100 గ్రాములు తక్కువ ఇచ్చినా అది నేరమే. షాపులో కచ్చితంగా ఎలక్ట్రానిక్ తూకం యంత్రం ఉండాలి మరియు అది మీకు కనిపించేలా ఉండాలి.

✅ పరిష్కారం (The Solution - Step by Step):

1. తూకం తనిఖీ: డీలర్ తూకం వేసినప్పుడు మీకు అనుమానం వస్తే, అక్కడే ఉన్న వేరే వస్తువుతో సరిచూసుకోమని అడగండి. డీలర్ నిరాకరిస్తే అది చట్టవిరుద్ధం.

2. టోల్ ఫ్రీ నంబర్ (1967): తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రేషన్ సమస్యల కోసం 1967 అనే టోల్ ఫ్రీ నంబర్ ఉంది. బియ్యం ఇవ్వకపోయినా లేదా లంచం అడిగినా వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.

3. తహసీల్దార్ (MRO) కి ఫిర్యాదు: మీ మండల పరిధిలోని తహసీల్దార్ రేషన్ షాపులపై పర్యవేక్షణ అధికారి. వ్రాతపూర్వక ఫిర్యాదు ఇస్తే వారు షాపును తనిఖీ చేసి సీజ్ చేసే అవకాశం ఉంటుంది.

4. సోషల్ ఆడిట్: గ్రామ సభల్లో లేదా వార్డు మీటింగుల్లో రేషన్ షాపు పనితీరుపై నిలదీయండి. డీలర్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే సామూహికంగా సంతకాలు చేసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి.

24/02/2026

అవినీతి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిందే, దీని పర్యవసానం ఏమిటో చాలా మందికి తెలియదు, కొంత మందికి తెలిసినా పట్టించుకోరు, డబ్బు ఇవ్వంది పనులు జరగడం లేదు అని చాలా మంది అనుకుంటున్నారు, అలా అనడానికి, అవ్వడానికి కారకులు ఎవరు...... ❓ ప్రజలె చట్ట బద్దం కాని పనులు చేయించుకోవడానికి, త్వరిత గతిన పనులు చేయించుకోవడానికి మామూళ్లు నెపం తో డబ్బు ముట్టచెబుతున్నారు.ఇది ఒక్క ప్రజల కె కాదు, అన్నింటి పై దీని ప్రభావం ఉంటుంది, కమీషన్, గుడ్ విల్, ఇలా ఇస్తనే కాంట్రక్టు పనులు వస్తాయ్, అలా దక్కించుకున్న వారు నాణ్యత తో కూడిన పనులు చేస్తారా ...❓ అక్రమానికి అలవాటుపడ్డ వారు...... సక్రమంగా విధులు నిర్వర్తించగలరా.......❓ అక్రమంగా ఎన్నికైన పాలకులు సక్రమంగా పాలన చేయగలరా.....❓ అక్ర మంగా పుట్టిన వారు సక్రమంగా సంసారం చేయగలరా.....❓చేయరు. అక్రమానికి పాల్పడిన పాలకులకు అధికారు లకు హానిక సంబంధిత కార్యాలయాలలో అక్రమ దారుల/ఏసీబీకి పట్టుబడిన వారి విగ్రహాలు ప్రతిష్టించే ప్రయత్నం చేయాలి. ప్రజలు చైతన్యం కానంతవరకు చివరికి ఎవరికీ నష్టం ప్రజలకే, కానీ ఇది ప్రత్యక్షంగా తెలియదు, అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అనేదే మా ఆలోచన,మేలుకో భారతీయుడా.....🫱🏾‍🫲🏼 రండి చేయి చేయి కలపండి🫱🏾‍🫲🏼 భావితరాల భవిష్యత్తు కోసం అవినీతిపరులను పట్టించండి స్థానికంగా ఉన్న అవినీతి నాయకులను/అధికారులను/పాలకులను వదలవద్దు. కేంద్ర రాష్ట్ర నిజాయితీ గల అధికారులకు తెలపండి గూగుల్ సెర్చ్ చెయ్యండి🤝 ఇకనైనా మేధావులు& ప్రజలు మౌనం వీడి స్మార్ట్ ఫోన్ తీయండి డిజిటల్ టెక్నాలజీ వాడండి అవినీతి అంతం వైపు అడుగులు వేయండి. 🤝 భారత ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీమ్ . అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ACB)ని సంప్రదించండి:
టోల్ ఫ్రీ నంబర్: 1064�వాట్సాప్: 8333995858�ఈమెయిల్: [email protected]
జిల్లాల వారీగా ACB సంప్రదింపు వివరాలు:
• కర్నూలు: డిఎస్పీ, నర్సింగ్ రావు పేట, ఫోన్: 08518-273783, సెల్: 9440446178
• అనంతపురం: డిఎస్పీ, శ్రీసదన్, సంగమేష్ నగర్, ఫోన్: 08554-274170, సెల్: 9440446181
• నెల్లూరు: డిఎస్పీ, కొండ బాలరామ్ రెడ్డి స్ట్రీట్, ఫోన్: 0861-2331833, సెల్: 9440446184
• ఒంగోలు: డిఎస్పీ, CRP క్వార్టర్స్, ఫోన్: 08592-232300, సెల్: 9440446189
• తిరుపతి: డిఎస్పీ, రాఘవేంద్ర నగర్, ఫోన్: 08772-220252, సెల్: 9440446190
• కడప: డిఎస్పీ, మారుతినగర్, ఫోన్: 08562-244637, సెల్: 9440446191
• తూర్పు గోదావరి (రాజమండ్రి): డిఎస్పీ, తిలక్ రోడ్, ఫోన్: 0883-2467833, సెల్: 9440446160
• కాకినాడ: డిఎస్పీ, నాగమల్లి తోట జంక్షన్, ఫోన్: 0884-2342785, సెల్: 9440446161
• ఏలూరు (పశ్చిమ గోదావరి): డిఎస్పీ, సెయింట్ జేవియర్ నగర్, ఫోన్: 0881-2232017, సెల్: 9440446157
• కృష్ణా (విజయవాడ): డిఎస్పీ, సిద్ధార్థనగర్, ఫోన్: 0866-2474140, సెల్: 9440446164
• గుంటూరు: డిఎస్పీ, చంద్రమౌళి నగర్, ఫోన్: 0863-2225850, సెల్: 9491305638
• విశాఖపట్నం: డిఎస్పీ, డాక్టర్స్ కాలనీ, సీతమ్మధార, ఫోన్: 0891-2552894, సెల్: 9440446170
• విజయనగరం: డిఎస్పీ, కుసుమ గజపతి నగర్, ఫోన్: 08922-276404, సెల్: 9440446174
• శ్రీకాకుళం: డిఎస్పీ, ఆఫీసియల్ కాలనీ, ఫోన్: 08942-222754, సెల్: 9440446124
అవినీతిని అంతం చేయడానికి మీ వంతు కృషి చేయండి. ప్రజా సంకల్ప వేదిక, అవినీతి నిరోధక విభాగం రాష్ట్ర అధ్యక్షులు.... మోటపోతుల శివకుమార్ 8978972408 🇮🇳 ప్రజలే సుప్రీమ్🇮🇳 జై హింద్🇮🇳 చేయి చేయి కలపండి🇮🇳

ప్రజా సంకల్ప వేదిక  ఆంధ్రప్రదేశ్
19/02/2026

ప్రజా సంకల్ప వేదిక ఆంధ్రప్రదేశ్

*పుల్వమా దాడిలో వీరమరణం పొందిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్న ప్రజా సంకల్ప వేదిక*ఈ విషాద దినాన, పుల్వామా ఉగ్రదాడిలో...
14/02/2026

*పుల్వమా దాడిలో వీరమరణం పొందిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్న ప్రజా సంకల్ప వేదిక*

ఈ విషాద దినాన, పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన సైనికులకు మా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము.

దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం వారు చేసిన అత్యున్నత త్యాగం భారత ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Central Reserve Police Force కు చెందిన ఆ వీర జవాన్లు దేశ భద్రత కోసం అచంచల సంకల్పంతో విధి నిర్వహణలో ఉన్నపుడు అమరులయ్యారు.

వారి పరాక్రమం, నిబద్ధత, త్యాగం ప్రతి భారతీయునికి శాశ్వత స్ఫూర్తి.

వారు శరీరంగా మన మధ్య లేకపోయినా, వారి ఆత్మ దేశాన్ని కాపాడుతూనే ఉంది. వారి త్యాగం మనలో న్యాయం, శాంతి, జాతీయ ఐక్యతను కాపాడే సంకల్పాన్ని మరింత బలపరచాలి.

అమరవీరులందరికీ మా వినమ్ర ప్రణామాలు. వారి త్యాగం ఎప్పటికీ వ్యర్థం కాదు.

సదా ప్రజా సేవలో...
*ప్రజా సంకల్ప వేదిక – కేంద్ర కమిటీ* www.prajasankalpavedika.com

2026 -2027 ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర స్థాయి వివిధ  విభాగాల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మానవ...
11/02/2026

2026 -2027 ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర స్థాయి వివిధ విభాగాల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మానవ పరిరక్షణ కమిటీ విభాగం జాతీయ ఉపాధ్యక్షురాలు గోనా మానస గారు . వేదిక: విశాఖపట్నం

2026 -2027 ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర స్థాయి వివిధ  విభాగాల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. వేదిక : విశాఖపట...
11/02/2026

2026 -2027 ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర స్థాయి వివిధ విభాగాల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. వేదిక : విశాఖపట్నం

Address

12/110 Srinivasa Complex Porumamilla Near Sri Venkateswara Swami Temple
Porumamilla
516193

Alerts

Be the first to know and let us send you an email when prajasankalpavedika Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category