Juluri Sriramulu Advocate Karimnagar Telangana

Juluri Sriramulu Advocate Karimnagar Telangana Practicing as advocate and deals with civil criminal and consumer cases in KARIMNAGAR Dt Head Quarter

09/08/2025

In a decisive move to uphold legal ethics, the Bar Council of Delhi has cautioned advocates against self-promotional activities on digital platforms, citing Rule 36 of the Bar Council of India Rules.

The Council flagged concerns over legal influencers, unauthorized legal advice, and sharing of promotional content related to ongoing matters, all of which may amount to professional misconduct under Section 35 of the Advocates Act, 1961.

Advocates have been directed to immediately remove such content or face disciplinary action, including potential suspension of their license.

09/08/2025

The Supreme Court has ruled that complaints under Section 138 NI Act must be filed where the payee holds their bank account, not where the cheque is dropped.

In a significant clarification, the Court held that once the payee’s bank account is established (in this case, Mangalore), territorial jurisdiction lies there, even if the cheque was physically deposited elsewhere (Mumbai).

“The understanding to the contrary… was erroneous and completely opposed to the clear mandate of Section 142(2)(a) of the NI Act.”

Orders of both the High Court and Magistrate were set aside. The case now returns to Mangalore for fresh adjudication.

04/11/2024

🌹🌹🌹నాకు శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ పేరు పేరునా ధన్యవాదములు…
జూలూరి శ్రీరాములు, న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్,
జిల్లా ప్రధాన న్యాయస్థానం,
కరీంనగర్. సెల్. 9440077011.🙏🙏🙏

27/10/2024

*శుభోదయం* :
ఎలా బ్రతకాలో తెలియక బాధపడకు............
ఎందుకంటే గూటినుండి బయలుదేరిని పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని................
అయినా ఎగురుకుంటూ పోతున్నది కదా..............
మన జీవితం కూడా అంతే *ప్రయత్నమే జీవితం* .

14/08/2024

అందరికీ విన్నపం.....🙏🏼
కొన్ని చోట్ల అవగాహన రాహిత్యం వల్లనో లేదా కట్టిన జెండా పొరపాటున గాలికి కింద పడిపోయినా లేదా కోతులు ఉన్న ప్రాంతంలో కోతులు కింద పడేసినా దయచేసి చూసి, చూసిన వారు ఫోటో తీసి జాతీయ జెండా అవమానం అంటూ గ్రూప్లో ఫార్వర్డ్ చేయకండి🙏. మీకు జాతీయ జెండా పై అభిమానం ఉంటే పడిపోయిన జెండాను తీసి సరిచేయండి. మీడియా మిత్రులు కూడా ఇలాంటివి పేపర్లో వేయకండి 🙏. ఎందుకంటే మన జాతీయ జెండాను మనం అవమానపరచుకోవద్దు. మన దేశ ప్రజలందరూ ఇంటికో జెండా ఎగరవేసి మన జాతీయ ఐక్యతను చాటి చెప్పాలని ఆకాంక్షిస్తున్నాను.
78 సంవత్సరాల పండుగను ఘనంగా వైభవంగా జరుపుకుందాం
🙏 జై హింద్... 🐯🇮🇳🦚🙏

26/07/2024

చిన్న సందేశాత్మక కధ.
🌹🌹🌹🌹🌹🌹🌹

ఇది ఒక మధ్య తరగతి కుటుంబములో జరిగిన కథ.

🍁ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అతని తండ్రి ఆతనిని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వేళ్ళు , T .V .స్విచ్ ఆఫ్ చేసి వేళ్ళు, టేబుల్,ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తు ఉండేవాడు .ఆ మాటలు ఆ కొడుకుకి నచ్చేవి కావు.ఇంట్లో ఉండటానికి ఇష్టం ఉండేది కాదు.

🍁 నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేక పోయిన వినేవాడు కానీ ఈ రోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది . ఉద్యోగం రాగానే వేరే చోటుకి వెళ్లిపోవాలి అని మనసులో అనుకున్నాడు.

🍁ఇంటర్వ్యూకి బయలుదేరాడు తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న కొడుకుకి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి దైర్యంగా సమాధానం చెప్పు ఒక వేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలని కూడా నువ్వు ధైర్యంగా ఎదురుకో అని చెప్పి ఖర్చులకు కొంచం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపాడు.

🍁ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్ళాడు. అంత పెద్ద బిల్డింగ్ కి సెక్యూరిటీ లేదు.గేట్ యొక్క గడి కొంచం వెళ్తున్న వాళ్ళ చేతికి తగిలేటట్లు ఉంది దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు .లోపల గేట్ కి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి .ఆ మొక్కలకు నీళ్లు పట్టి టూబ్ ని నడిచే దోవలో పడేసి ఆ తోట వాడు మోటార్ ఆఫ్ చేయటానికి వెళిపోయాడు .ఆ టూబ్ ని చేతిలోకి తీసుకోని ఒక మొక్క యొక్క మొదళ్ళ మీద నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు.

🍁రిసెప్షన్ లో ఎవ్వరు లేరు. ఇంటర్వ్యూ కి 1 ST ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టి ఉంది .మెల్లగా మెట్లు ఎక్కాడు దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎవ్వరు ఆఫ్ చేయకుండా ఉన్నాయి .లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా సడన్ గా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్లి లైట్స్ స్విచ్లను ఆఫ్ చేసి పైకి వెళిపోయాడు.

🍁1ST ఫ్లోర్ లో ఒక పెద్ద హాలు లో చాలా మంది కూర్చొని ఉన్నారు. అంత మందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగు వేసాడు, అక్కడ ఫ్లోరుపై ఉన్న MAT పై WELCOME తల క్రిందులుగా ఉంది దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు.ఆ హాల్ లో ముందు వరుసలో చాలా మంది కూర్చొని ఉన్నారు ,వెనుక వరుస కాళిగా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది . గది లో ఎవ్వరు లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూ కి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు.
🍁ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలోనుండి బయటకి పంపిస్తున్నారు ,దానివల్ల లోపల ఎటువంటి ప్రెశ్నలు అడుగుతున్నారో అనే విషయం తెలుసుకోలేక పోయాడు.లోపల ఏమి ప్రశ్నలు అడుగుతారో అనే భయంతోనే లోపలికి వెళ్లి నిలబడ్డాడు.అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి తెరచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరతారు అని ఆ అధికారి అతన్ని అడిగాడు .ఇది కూడా ఒక ప్రశ్న లేక ఉద్యోగం లో చేరతారా అని అడిగారో అర్ధం కాకుండా ఆలోచిస్తూ నిలబడాడ్డు .
🍁అధికారి ఏంటి ఆలోచిస్తున్నావు ఇక్కడ మేము ఎవ్వరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు వచ్చే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో , ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడా కెమెరాలు పెట్టాము .ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ ని కానీ, టూబ్ లైట్స్ ని కానీ, ఫ్యాన్ ని కానీ ఆఫ్ చేయలేదు కానీ మీరు ఒకరే అనింటిని సరిచేస్తూ లోపలికి వచ్చారు.మేము మిమల్ని ఉద్యోగం లోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు.
🍁నాన్న చెప్పే మాటలు అన్ని నాకు విసుకు తెప్పించేవి,కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయి అని సంతోష పడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది . ఉద్యోగం లో చేరేటప్పుడు నాన్న ని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనస్సులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు
🍁తండ్రి మన కోసం ఎం చెప్పినా ,ఎం చేసినా మన భవిష్యత్తు కి మంచి జరగాలనే చేస్తాడు.
🍁ఉలి దెబ్బలకి శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు . ఆ బాధని తట్టుకున్నపుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది .
🍁తండ్రి మనలో ఉన్న చెడుని ఉలి పెట్టి కొట్టినట్లు పోగొడతాడు.తల్లి బిడ్డని పాలిచ్చి,లాలించి,కథ చెప్పి పడుకోపెట్టి పెంచుతుంది ,కానీ తండ్రి అలా కాదు తాను చూడని లోకాన్నితన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చోపెట్టి లోకాన్నిచూపిస్తాడు.
🍁తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర!
🍁తల్లి కష్టపడేదాన్నికనిపెట్టచ్చు కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెప్తే కానీ కనిపెట్టలేరు.
🍁మనకి తండ్రి 5 సంIIల వరకు గురువు లాగా 25 సంIIలకు శత్రువు లాగా కనిపించే తండ్రి గురించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుస్తుంది .
🍁తల్లి వృధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లోనో ఉండి తన జీవితాన్ని గడుపుతుంది . 🍁తండ్రి అలా ఉండలేడు చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు .
🍁 అందువల్ల తల్లితండ్రుల్ని ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోకుండా ప్రాణంతో లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు....



గమనిక:- చనిపోయినతరువాత గొప్పలు చూపించుకోవటానికి పంచభక్ష్యాలతో వేలమందికి ఆర్భాటంగా భోజనాలుపెట్టే సంతానం ఆలోచించండి. బ్రతికుండగా తల్లితండ్రులకు కడుపునిండా ప్రేమగా నాలుగు ముద్దలు పెట్టండి సంతోషంగా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించండి 🙏.

Forwarded as received by me.

20/07/2024

Good morning to all.

🙏🌺కర్మ ఫలం....పుణ్య ఫలం🌺🙏

🌺ఈ కథ ను ప్రతీ ఒక్కరూ మిస్ అవ్వకుండా చదవాగలరని ఆశిస్తూ. 🌺

🌺చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు 🚌తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు 🚌ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ⛅ప్రారంభమైంది. 🌺

🌺ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక 🌋పిడుగుపాటు వల్ల బస్సుకు🚌 50 అడుగుల దూరంలో ఒక చెట్టు🌴 పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును🚌 ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ🎫 వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.

కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది.
ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.

ఆ బస్సు🚌రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు 🌋బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు🌴 కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 🌋30అడుగుల దూరంలోనే పడ్డది .ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

ఆ బస్సులో వున్న ఒక పెద్దయన ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.! 🌺

🌺నేను చేప్పేది జాగ్రత్తగా వినండి! 🌺

🌺 ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌴చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో 🚌వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి
మరణిస్తాడు.మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!🏃
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.

చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.మొదట గా ఆ పెద్దమనిషే ధైర్యం చేసి భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో 🚌 కూర్చున్నారు.

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును 🌴ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు. 🌺

🌺చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును🌴 ముట్టుకోవడానికి నిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. అంటూ అతన్ని దూషిస్తూ ..బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును🌴 ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు🌋 వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు ముాసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు...కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు. 🌺

🌺ఆ బస్సుపై…అవును.. 🚌బస్సుపై పిడుగు🌋 పడి అందులో వున్న ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ...ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో వున్నవారు, వారి వారి స్వార్థం వల్ల..... ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలసి వుండడం వల్ల ,.. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షనం మారంత మృత్యువాత పడడం జరిగింది.
"*కర్మ ఫలం"(పుణ్య ఫలం)అంటే ఇదే కాబోలు.🙏

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదే అని అనుకుంటాము. 🌺

🌺కాని, ఆ పుణ్యఫలం మన
👨‍👩‍👦‍👦తల్లిదండ్రులది కావచ్చు!
👸జీవిత భాగస్వామిది కావచ్చు!
👷పిల్లలది కావచ్చు!
👧తోబుట్టువులది కావచ్చు!
👦మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా
👨 మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉండవచ్చు.

ఒక సినిమాలో* *చెప్పినట్లుగా
బాగుండడం” అంటే 'బాగా'.. ఉండడం కాదు.👪అందరితో కలిసి ఆనందంగా కలసి ఉండడం అని అర్థం.👧👸🏃🌺

Forwarded as received by me.

19/07/2024

Good morning to all.
🙏🙏మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు🙏✍️💯

మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది.

శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı

ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.

పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు

మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి.

వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది.

శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı
మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı

ఇతర పక్షులు పీకలు పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి. వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి, జంతువులకు, పక్షులకు ఇతర జీవరాసులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగింది.

వృక్షాలకు సైతం సంతోషం, దుఃఖం లాంటి మానవ సహజమైన లక్షణాలు ఉంటాయి. గతజన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే ఈ జన్మలో వృక్షాలు అనుభవిస్తుంటాయని “మనుస్మృతి” పేర్కొంటుంది.

మానవాళి సంతోషం కోసమే దేవుడు వృక్షాలను సృష్టించాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండే ఈ వృక్షాలు మనుషులను మాత్రం ఈ ఎండ, వానల నుండి కాపాడతాయి. మహర్షులు సైతం వృక్షాల నీడనే గాఢమైన ద్యానంలో మునిగి తపమాచరించారని పురాణాల్లో చదివాం. నరకప్రాయాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను నాటి, పెంచి పోషిద్దాం.

Forwarded as received by me.

13/07/2024

ఒక పోలీస్, ఒక వర్తకుడు,
ఒక లాయర్...ముగ్గురూ కలసి పక్క దేశంలో ఓ కోర్టు కేసు విషయమై
ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు.
సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమై, మిమల్ని తినేస్తా,చంపెస్తా ...అంటూ పెద్దగా కేకలు పెడుతూ వాళ్ళని భయబ్రాంతులను చేయసాగాడు. .

ముగ్గురూ భయంతో వణికిపోవడం చూసిన ఆ రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చి.... వాళ్ళతో యిలా అన్నాడు.

*మీ ముగ్గురూ, మీకు తోచింది సముద్రం లోకి విసిరి వేయండి.*
*నేను తెచ్చి యిస్తే గెలుపునాదే. వస్తువు తేలేకపోతే గెలుపు మీదే...* *గెలిచిన వారిని వదిలేస్తాను. అంతేకాకుండా వాళ్లకు నేను జీవితాంతము బానిసగా ఉంటానని చెప్పాడు.*

సరేనని ముందుగా పోలీస్ తన నెత్తిమీదనున్న టోపీని విసిరేశాడు.
కాసేపటికి రాక్షసుడు, సముద్రం నీటి మీద తేలుతున్న ఆ టోపీని ఎటువంటి కష్టంలేకుండా తెచ్చి
ఆ వ్యక్తిని మింగేశాడు.

తరువాత వర్తకుడు ఇలాకాదని తన మెడలో ఉన్న బరువైన బంగారు గొలుసును నీళ్ళలోకి విసిరేశాడు.
రాక్షసుడు సముద్రంలోకి దూకి దాన్నీ తెచ్చి అతన్ని కూడా మింగేశాడు.

ఇక మిగిలింది లాయర్.....
ఇదంతా గమనించిన
అతను, కొంచెం ఆలోచన చేసి డిఫెన్స్ బుర్రనుపయోగించి తన దగ్గరవున్న నీళ్ళ సీసా మూత తీసి అందులోని నీళ్ళను సముద్రం లోకి ధారగా పోశాడు.నా మంచి నీళ్ళను నాకు తెచ్చి యివ్వు అన్నాడు.

ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగి పోయింది.ఇది లాయర్ దెబ్బ... ఎలావుంది? అన్నాడు రాక్షసుడితో.
రాక్షసుడు తన ఓటమిని అంగీకరించి, అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకుని,ఇప్పుడు నేను మీకు ఏమి చేయగలనని వంగి వేడుకున్నాడు. వెంటనే లాయర్, నాతో వచ్చిన ఇద్దరినీ బ్రతికించు అని ఆజ్ఞాపించాడు. వాడు వెంటనే మింగినవాళ్ళని కక్కేశాడు.

మంచి పని చేశావు.యింక ఎవ్వరినీ యిలా బాధించకుండా వుంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తాను అన్నాడు తెలివిగా ఆ లాయర్.
రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రం లోకి దూకి మాయమయ్యాడు.

*ఎవరికైనా ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆలోచించి సముచిత న్యాయం చేయగలిగే జ్ఞానం,సత్తా ఉన్నవాడు లాయర్..* 🙏

Forwarded as received by me.

10/05/2024

*🔊అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే*

*🔹సైబర్‌ నేరాల నియంత్రణకు ఆర్బీఐ చర్యలు*

*♦️మూణ్నెల్లలోనే 2.5 లక్షల బ్యాంకు ఎకౌంట్ల మూసివేత*

*💠ఇతరులు*
*వినియోగించుకునేందుకు* *అనుమతిస్తే చిక్కులు తప్పవంటున్న దర్యాప్తు సంస్థలు*

*🍥ఈనాడు - హైదరాబాద్‌*
*అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్‌ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టిపెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని ఈ తరహా 2.5 లక్షల ఖాతాలను 3 నెలల కాలంలోనే రద్దుచేశారు*

*🔶ఎక్కడో ఉండి.. ఇక్కడి ఖాతాలకు..*

*✡️దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఒక్క తెలంగాణలోనే సైబర్‌ నేరాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో బాధితులు రూ.2 వేల కోట్లు పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా లెక్కలేస్తే ఈ మొత్తం రూ.15-20 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్మును మళ్లించుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వినియోగించుకుంటున్నారు. నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతు కూలీలకు కమీషన్‌ ఆశ చూపి..వారి ఖాతాల వివరాలు తీసుకుంటున్నారు. వారితో ఖాతాలు తెరిపించేందుకు స్థానికంగా ఏజెంట్లనూ నియమించుకుంటున్నారు. కొల్లగొట్టిన డబ్బును తొలుత వీరి ఖాతాల్లోకి, అక్కడ నుంచి మరికొన్ని ఖాతాల్లోకి మళ్లించి..తర్వాత ఈ సొమ్మును క్రిప్టోగా మార్చి విదేశాలకు తరలిస్తున్నారు*

*♦️కట్టడికి కఠిన చర్యలు*.

*🌀దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు వ్యవస్థీకృతమయ్యాయి. కొందరు విదేశాల నుంచీ కార్యకలాపాలు సాగిస్తుండటంతో వారిని పట్టుకోవడం, నేరాలు జరగకుండా అడ్డుకోవడం దర్యాప్తు సంస్థలకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో నేరగాళ్లకు ఆయువు పట్టులాంటి బ్యాంకు ఖాతాల ఆటకట్టించాలని దర్యాప్తు సంస్థలు నిర్ణయించాయి. దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సూచనల ఆధారంగా ఆర్బీఐ అనుమానాస్పద ఖాతాల రద్దుకు బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం..పెద్దగా లావాదేవీలు జరగని ఖాతాల్లోకి ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు జమకావడం, ఆ వెంటనే ఆ డబ్బు వేరే ఖాతాలోకి మళ్లడం వంటివి జరిగినప్పుడు దాన్ని అనుమానాస్పద ఖాతాగా పరిగణిస్తారు. ఆ ఖాతాదారుడిని పిలిచి విచారిస్తారు. అంత సొమ్ము ఎలా వచ్చింది? ఎవరు పంపారు? అక్కణ్నుంచి మరో ఖాతాలోకి ఎలా వెళ్లిందనే వివరాలు ఆరా తీస్తారు. సరైన సమాధానం లభించకపోతే.. అనుమానాస్పద ఖాతాగానే పరిగణించి రద్దు చేస్తారు. క్రిమినల్‌ కేసులూ నమోదు చేస్తారు. ఇలా ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 2.5 లక్షల బ్యాంకు ఖాతాలు రద్దయ్యాయి. ‘ఈ ప్రయోగం సత్ఫలితాన్నిస్తోంది. తెలిసి చేసినా, తెలియక చేసినా తమ ఖాతాను వేరే వాళ్లు వాడుకోవడానికి అనుమతిస్తే చిక్కులు తప్పవనే విషయం సామాన్య ఖాతాదారులకు కూడా తెలిసివస్తుంది. దీనివల్ల సైబర్‌ నేరగాళ్ల ముందరి కాళ్లకు బంధాలు వేసినట్లవుతుందని’ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అనుమానాస్పద సిమ్‌కార్డులు రద్దు చేయిస్తున్నారు. నేరాలకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న 33,029 సిమ్‌కార్డులు, ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా 3,769 సెల్‌ఫోన్లను స్తంభింపజేశారు*

*🔹ఆశపడితే నేరస్థులవుతారు*

*💥సైబర్‌ నేరగాళ్లు తాము చేసే నేరాల ద్వారా కొల్లగొట్టే నగదు లావాదేవీల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలను వినియోగించడం ఇటీవల ఎక్కువైంది. నేరానికి ఉపయోగిస్తారని తెలిసినా కొందరు సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో వివరాలు ఇస్తున్నారు. అలా ఇచ్చే వారూ నేరస్థులే అవుతారు. నేరాలు చేసే వారికి సిమ్‌కార్డులు ఇచ్చినా నేరస్థులుగానే పరిగణిస్తాం*

*🎙️- కొత్తపల్లి నరసింహ, డీసీపీ, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌*

Forwarded as received by me

07/05/2024

డబ్బు ఎవరితోనైనా ఖర్చు చేయవచ్చు...
సమయం మాత్రం మనకు ఆనందం కలిగిన వారితోనే గడపాలి....

ఎందుకంటే... ?
ఖర్చు చేసిన డబ్బు మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ,వృధా అయిన సమయాన్ని తిరిగి పొందలెం...
మనసుకు నచ్చిన వారితో గడిపిన ఆనంద సమయం ఏపుడు గుర్తుచేస్తూనే ఉంటుంది.....

చేయాల్సిన పనిని చేయకపోవడం,
చేయకూడని పనిని చేయడం రెండూ తప్పే...

శుభోదయం....💐

Address

VAVILALAPALLY
Karimnagar
505001

Telephone

9440077011

Website

Alerts

Be the first to know and let us send you an email when Juluri Sriramulu Advocate Karimnagar Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Juluri Sriramulu Advocate Karimnagar Telangana:

Share